లింగాయత్ లు బీజేపీకి షాక్ ఇస్తారా?

38
- Advertisement -

కర్నాటకలో ఎన్నికల వేళ రాజకీయ సమీకరణలు క్షణం క్షణం మారిపోతున్నాయి. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు దగ్గర పడే కొద్ది.. మెజారిటీ సామాజిక వర్గంపైన ప్రధాన పార్టీలు ఫోకస్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే పార్టీ గెలుపోటములను డిసైడ్ చేయడంలో ఆయా సామాజిక వర్గలే కీలక పాత్ర పోషిస్తాయి. ఆ విధంగా కర్నాటకలో మెజారిటీ ఓటు బ్యాంకు ఉన్న లింగాయత్ లు ఈసారి ఏ పార్టీకి మద్దతు గా నిలుస్తారు.? లింగాయత్ ల అండతో అధికారం చేపట్టే పార్టీ ఏది ? లింగాయత్ ల చుట్టూ ప్రధాన పార్టీల సమీకరణలు ఎలా ఉన్నాయి ? అనే ప్రశ్నలు ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా మారాయి. లింగాయత్ లు మొదటి నుంచి కూడా బీజేపీకి అధిక ప్రదాన్యం ఇస్తూ వచ్చారు.

ఎందుకంటే హిందుత్వ ఎజెండాతో ఉన్న పార్టీ కావడంతో లింగాయత్ ల మద్దతు బీజేపీకి ఉండడం సహజం. అయితే ఈసారి లింగాయత్ లు బీజేపీకి హ్యాండ్ ఇస్తారనే చర్చ జరుగా సాగుతోంది. రిజర్వేషన్ల విషయంలో లింగాయత్ లకు అధిక వాటా ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తోంది. ముఖ్యంగా లింగాయత్ లలోని ఉపవర్గం అయిన పంచమసాలీలు అధిక సంఖ్యలో ఉన్నారు. అందువల్ల ఈ డిమాండ్ తరచూ వినిపిస్తూనే ఉంది. అయితే బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం మాత్రం రిజర్వేషన్స్ కల్పించడంలో జాప్యం చేస్తోందని లింగాయత్ లలోని కొన్ని ఉప వర్గాలలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో ఈసారి లింగాయత్ ల ఓటు బ్యాంకు కొంత కాంగ్రెస్ వైపు మల్లె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read:ప్రభాస్ స్టైల్ మార్చాడు

ఈ వాదనలను బలపరుస్తూ లింగాయత్ వర్గంలోని కొంతమంది నేతలు ఇటీవల కాంగ్రెస్ కు మద్దతు పలికారు. కానీ కమలనాథులు మాత్రం లింగాయత్ లు 100 శాతం తమతోనే ఉన్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ లింగాయత్ ల ద్వారా లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నప్పటికి ఆ కమ్యూనిటీ మాత్రం తమతోనే 100 శాతం ఉందని మాజీ సి‌ఎం యడ్యూరప్ప ఇటీవల చెప్పుకొచ్చారు. అయితే ఇవన్నీ బీజేపీ పై పై మాటలేననేది కొందరి వాదన. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బీజేపీకి ప్రధాన బలం అయిన లింగాయత్ లో మెజారిటీ ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారట. మొత్తానికి ఈసారి ఎన్నికల్లో బీజేపీకి లింగాయత్ లు ఇచ్చే షాక్ మామూలుగా ఉండదనేది కొందరి అభిప్రాయం.

Also Read:ఆదిపురుష్ ట్రైలర్ కి టైమ్ లాక్

- Advertisement -