ఈ పోషకాలు లోపిస్తే..అంతే సంగతులు!

8
- Advertisement -

ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు కావాలి. ఏ ఒక్క విటిమన్ లోపించినా అనారోగ్యం పాలు కావడమే కాదు డిప్రెషన్‌లోకి వెళ్తారు.విటమిన్ డి…మానసిక స్థితి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. చాలా మంది చలికాలంలో తేలికపాటి డిప్రెషన్‌ను అనుభవిస్తారు. ఈ సీజన్‌లో విటమిన్ డి స్థాయిలు తక్కువ గా ఉండటం దీనికి కారణం. సాల్మన్, సార్డినెస్ వంటి కొవ్వు చేపలు, పాలు, గుడ్లు, పుట్టగొడుగులు ఎక్కువగా తీసుకుంటే విటమిన్ డీ లోపం నుండి బయటపడవచ్చు.

సెరోటోనిన్, డోపమైన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది విటమిన్ బీ. ముఖ్యంగా బీ6,బీ9,బీ12 ఇవి మన మెదడును కంట్రోల్‌లో ఉంచడానికి సాయపడతాయి. ఆమ్లాల లోపం మెదడు ఆరోగ్యం EPA, DHA వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలపై ఆధారపడి ఉంటుంది. ఇవి వాపును తగ్గించడంలో సాయపడుతాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మానసిక రుగ్మతలతో సంబంధం కలిగి ఉంటుంది.

ఐరన్ లోపం ఆక్సిజన్ కోసం శరీరానికి ఐరన్‌ అవసరం. ఐరన్ లోపం వల్ల అలసట, చిరాకు వస్తుంది. ఇది మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. విటమిన్ సి లోపం విటమిన్ సి లోపం వల్ల అలసట, చిరాకు ఏర్పడుతుంది. జింక్ లోపం జింక్ న్యూరోట్రాన్స్మిటర్ స్థాయిలు, నాడీ వ్యవస్థ కార్యకలాపాలను నియంత్రిస్తుంది. తక్కువ జింక్ స్థాయిలు డిప్రెషన్‌కు దారితీస్తాయి. ఎవరికైనా డిప్రెషన్ ఉండవచ్చు.

Also Read:‘భలే ఉన్నాడే’పై మారుతి ప్రశంసలు

- Advertisement -