సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం:జోయల్ డేవిస్

208
joyal devis

దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంలో నిన్నటి ఘటనలో పోలీస్ పై మీడియా చానల్స్, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం అన్నారు సిద్దిపేట జిల్లా కమిషనర్ జోయల్ డేవిస్. జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల సిబ్బంది పకడ్బందీగా తమ విధులు నిర్వహిస్తోందన్నారు.

నిన్నటి సోదాల ఘటనలో ఎగ్జక్యూటివ్ అధికారి వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందే సర్చ్ వారెంట్ ఇచ్చారు….అక్కడ జరిగిన ప్రతి విషయం సాక్షుల సంతకాలు తీసుకునే చేశారని తెలిపారు. సురభి జితేందర్ రావు సమక్షంలోనే అంతా జరిగింది…..ఎగ్జక్యూటివ్ అధికారి పంచనామా పూర్తి చేసి బయటకు వచ్చేముందు బీజేపీ కార్యకర్తలు దాడి చేసి డబ్బులు ఎత్తుకెళ్లారుని తెలిపారు.

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అందరూ సహకరించాలి….నిన్న నాలుగు ప్రదేశాల్లో సోదాలు చేస్తే ఒక్కరి వద్దనే డబ్బులు దొరికాయని తెలిపారు.నిన్నటి ఘటనలో 5 గురిని గుర్తించాం, మరో ఇరవై మందిపై కేసులు నమోదు చేశాం అన్నారు. అధికారులు సీజ్ చేసిన నగదును ఎత్తుకెళ్లాడం పెద్ద నేరం ….బండి సంజయ్ కి సిద్దిపేట జరిగిన ప్రతి విషయంను క్లుప్తంగా చెప్పామన్నారు. సిద్దిపేట కు వస్తె లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని..ఉప ఎన్నికల ప్రచారం కోసం వచ్చే వారిని ఎవరిని కూడా అడ్డుకోవడం చేయడం లేదన్నారు. ఉప ఎన్నికల కోసం అదనంగా పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేశామన్నారు.