దళిత ఎమ్మెల్యేపై దాడి సిగ్గుచేటు: బడుగుల లింగయ్య యాదవ్

120
badugula

బీజేపీ నేతలు దళిత సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై దాడి చేయడాన్ని ఖండించారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. ఈ ఘటన సిగ్గు చేటు అని విమర్శించిన లింగయ్య యాదవ్…నిరాశ, నిస్పృహోతోనే దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు.

ఢిల్లీలోన మీడియాతో మాట్లాడిన లింగయ్య యాదవ్… దుబ్బాక ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెల‌వ‌బోతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. గ‌త 6 సంవ‌త్స‌రాల నుంచి సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నార‌ని గుర్తు చేశారు. కేంద్రం నుంచి తెలంగాణ‌కు పెద్ద‌గా స‌హాయం అంద‌డం లేద‌న్నారు.

జీఎస్టీ నిధుల కోసం టీఆర్ఎస్ ఎంపీలం పార్ల‌మెంట్‌లో పోరాడామ‌ని తెలిపారు. దుబ్బాక ఎన్నిక‌లో గెలిచేందుకు బీజేపీ విచ్చ‌ల‌విడిగా డ‌బ్బు ఖ‌ర్చు పెడుతుంద‌న్నారు. డ‌బ్బుల‌తో బీజేపీ నాయ‌కులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డార‌ని, ఆ న‌గ‌దును ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లే ఎత్తుకెళ్లిన విష‌యాన్ని ఎంపీ గుర్తు చేశారు.