12 గంటల వరకు 34.33 శాతం పోలింగ్

159
polling

దుబ్బాక ఉప ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు 35 శాతం పోలింగ్ న‌మోదైనట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ సరళిని పరిశీలించారు జిల్లా ఎన్నికల ప్రధానాధికారి భారతి హోళికేరి.

సాధార‌ణ ఓట‌ర్ల‌కు సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఓటేసేందుకు అనుమ‌తి ఇవ్వ‌నుండగా సాయంత్రం 5 నుంచి 6 గంట‌ల వ‌ర‌కు కొవిడ్ బాధితుల‌కు ఓటేసేందుకు అవ‌కాశం ఇవ్వ‌నున్నారు. మొత్తం 315 పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఓట‌ర్లు బారులు తీరారు. స‌మ‌స్యాత్మ‌క‌ పోలింగ్ కేంద్రాల వ‌ద్ద పోలీసులను భారీగా మోహ‌రించారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.