పెళ్లిపీటలెక్కనున్న హన్సిక.. వరుడు ఎవరంటే ?

121
- Advertisement -

చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్ ప్రారంభించిన హన్సిక, దేశముదురు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే, కొన్నాళ్లపాటు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌ని కూడా ఏలింది. అయితే.. ఇతర హీరోయిన్ల నుంచి గట్టి పోటీ రావడంతో, క్రమంగా ఆమెకు ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. ఆఫర్ల కోసం గ్లామర్ డోస్ పెంచినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే అమ్మడు పెళ్లి చేసుకొని, సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది.

హన్సిక మోత్వానీ సోహాల్ కతూరియా అనే ముంబై వ్యాపారితో చాలాకాలం నుంచి డేటింగ్ చేస్తోందని, ఒక కంపెనీలో వీళ్లు భాగస్వాములు కూడా ఉన్నారని తెలిసింది.ఇప్పుడు వీళ్ల పెళ్లికి సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. డిసెంబర్ 4వ తేదీన హన్సిక తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడబోతోందని ఒక ప్రముఖ పోర్టల్ వెల్లడించింది. డిసెంబర్ 2వ తేదీ నుంచే పెళ్లి కార్యక్రమాలు మొదలవుతాయని, అదే రోజు రాత్రి సుఫీ నైట్ నిర్వహించనున్నారని తెలిసింది.

 

ఇవి కూడా చదవండి

గీతాగోవిందం దర్శకుడితో బాలయ్య!

BB6.. డేంజర్ జోన్‌లో ఎంతమందో తెలుసా?

చర్మ సౌందర్యం కోసం ఇలా ట్రై చేయండి..

- Advertisement -