కోల్‌కతాను మట్టికరిపించిన చెన్నై..

279
chennai super kings
- Advertisement -

వరుస విజయాలతో జోష్ మీదున్న కోల్‌కతాకు షాకిచ్చింది చెన్నై. సొంతగడ్డపై జరిగిన పోరులో ఘన విజయాన్ని అందుకున్న చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరింది. కోల్‌కతా విధించిన 109 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

టార్గెట్ చేదించే దిశగా బ్యాటింగ్ కు దిగిన షేన్ వాట్సన్(17; 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సు), ఫాఫ్ డుప్లెసిస్(43), సురేశ్ రైనా(14), అంబటి రాయుడు(21), కేదర్ జాదవ్(8) పరుగులతో జట్టుకు విజయాన్ని అందించారు.

తొలుత టాస్‌ గెలిచిన చెన్నై..కోల్‌కతాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కోల్ కతా నైట్ రైడర్స్ ఆరంభం నుంచి చెన్నై ఘోరంగా కట్టడి చేయడంతో ఏడుగురు బ్యాట్స్ మన్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. కేవలం ఆండ్రీ రస్సెల్(50), రాబిన్ ఊతప్ప(11), దినేశ్ కార్తీక్(19) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేయగలిగారు.

ఈ సీజన్‌లో ఐదో విజయాన్ని అందుకున్న చెన్నై 10 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. ఈ మ్యాచ్ ముందు వరకూ మొదటి స్థానంలో ఉన్న కోల్‌కతా 8 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. బుధవారం రాత్రి 8 గంటలకి ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య వాంఖడే వేదికగా మ్యాచ్ జరగనుంది.

- Advertisement -