IPL 2023 :చెన్నైకి డిల్లీ షాక్ ఇస్తుందా?

48
- Advertisement -

నేటి ఐపీఎల్ లో రెండు కీలక మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు డిల్లీ క్యాపిటల్స్ తలపడనుండగా ఈ మ్యాచ్ మద్యాహ్నం 3:30 నిముషాలకు ప్రారంభం కానుంది. ఇక రెండవ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ మరియు కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభం కానుంది. అయితే ఈ రెండు మ్యాచ్ లు కూడా చెన్నై మరియు లక్నో జట్లకు అత్యంత కీలకం. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి. అటు డిల్లీ మరియు కోల్ కతా దాదాపుగా టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఆ రెండు జట్లు గెలిచిన ఓడిన ఒరిగేదెమి ఉండదు. కాగా చెన్నై ఇప్పటివరకు 13 మ్యాచ్ లు అడగా అందులో అందులో 7 విజయాలు సాధించి 15 పాయింట్లతో రన్ రేట్ పరంగా మెరుగ్గా ఉండడంతో రెండో స్థానంలో ఉంది.

లక్నో, బెంగళూరు, ముంబై, రాజస్తాన్ వంటి జట్లు కూడా ఏడు విజయాలతో చెన్నైకి గట్టి పోటీ ఇస్తున్నాయి. దీంతో ఇవాళ డిల్లీతో జరిగే మ్యాచ్ లో తప్పక గెలిస్తేనే చెన్నై ప్లే ఆఫ్ కు దూసుకెళుతుంది. కాగా డిల్లీ ఇప్పటికే టోర్నీ నించి నిష్క్రమించగా ఎలాంటి ఒత్తిడి లేకుండా మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. గత మ్యాచ్ లో డిల్లీ పంజాబ్ పై గెలిచి ఆ జట్టు కు ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. అలాగే ఇప్పుడు చెన్నై కి షాక్ ఇస్తే.. ధోని సేన ప్లే ఆఫ్ కు వెళ్ళే అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయని చెప్పాలి. ఇక మరోవైపు లక్నో కూడా ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే కోల్ కతా పై తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఒకవేళ కోల్ కతా గెలిచిన ప్లే ఆఫ్ కు వెళ్ళే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి మరి అటు డిల్లీ క్యాపిటల్స్ మరియు ఇటు కోల్ కతా నైట్ రైడర్స్ రెండు జట్లు చెన్నై, లక్నో జట్లపై పైచేయి సాధిస్తే ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది.

Also Read: IPL 2023:కింగ్స్ vs రాయల్స్.. ఆఖరి మ్యాచ్ ఇదే!

- Advertisement -