IPL:ఆరంభం నుంచి ఆడుతున్న ప్లేయర్స్ వీరే!

54
- Advertisement -

2008 లో ప్రారంభం అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ అభిమానులను ఇప్పటికీ కూడా ఉర్రూతలూగిస్తోంది. ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు లేని ఆధారణ ఐపీఎల్ కు లభిస్తుందంటే అభిమానులు ఈ లీగ్ ను ఎంతలా అదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ ద్వారా పరిచయమైన ఎంతో మంది ఆటగాళ్లు స్టార్ ప్లేయర్స్ గా ఎదిగారు. టీమిండియాలో సుస్థిర స్థానం సంపాధించుకున్నారు. అలాగే మరికొందరు ఆటగాళ్లు కనుమరుగైపోయారు. అయితే ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటికి కూడా ఆడుతున్న ప్లేయర్స్ కూడా ఉన్నారు. వారిలో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, వృద్ధిమాన్ సాహా, మనీష్ పాండే, దినేష్ కార్తీక్, రోహిత్ శర్మ… ఇలా చాలమందే ఉన్నారు.

ఎం‌ఎస్ ధోని ఆరంభం నుంచి కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్నాడు. 2008 నుంచి ఇప్పటివరకు చెన్నై జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. చెన్నై 5 సార్లు టైటిల్ విజేతగా నిలవడానికి కారణం ధోని కెప్టెన్సీనే. ఇక ఈ సీజన్ లో కూడా ధోని మరోసారి చెన్నై తరఫున బరిలో నిలవనున్నాడు. ధోని తర్వాత విరాట్ కోహ్లీ కూడా ఐపీఎల్ ప్రారంభం నుంచి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ఆడుతున్నాడు. కెప్టెన్ గా, ప్లేయర్ గా బెంగళూరు జట్టులో కోహ్లీ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

కప్పు కోసం ఎన్నో ఏళ్ళుగా నిరీక్షిస్తున్న బెంగళూరుకు ఈ ఏడాదైనా కప్పు వరిస్తుందేమో చూడాలి. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆరంభం నుంచి ముంబై ఇండియన్స్ జట్టు తరుపున ఆడుతూ వస్తున్నాడు. ముంబై నాలుగు సార్లు కప్పు గెలవడంలో రోహిత్ శర్మ పాత్ర చాలానే ఉంది. ఈ సీజన్ ఐపీఎల్ లో కెప్టెన్ గా కాకుండా ప్లేయర్ గా బరిలోకి దిగబోతున్నాడు. ఇక వీరితో పాటు దినేష్ కార్తీక్, శిఖర్ ధావన్, సాహా.. వంటి వారు టీంలు మారుతూ వచ్చినప్పటికి.. ప్రారంభం నుంచి ఐపీఎల్ ఆడుతున్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. అయితే స్టార్టింగ్ నుంచి ఆడుతున్న ప్లేయర్స్ లో విదేశీ ఆటగాళ్లు కాకుండా అందరూ స్వదేశీ ఆటగాళ్లు కావడం విశేషం.

Also Read:వీటితో కొలెస్ట్రాల్‌ కు చెక్ పెట్టండి…

- Advertisement -