IPL2023:టీమిండియా భవిష్యత్..” జైస్వాల్ ” విధ్వంసమే !

49
- Advertisement -

ఈ సీజన్ ఐపీఎల్ మొదలైనప్పటినుంచి రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైస్వాల్ పేరు గట్టిగా వినిపిస్తోంది. 21 ఏళ్ల ఈ కుర్రాడు ఎలాంటి ఒత్తిడి లేకుండా విధ్వంసక ఇన్నింగ్స్ లు ఆడుతూ భవిష్యత్ టీమిండియా ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు రాజస్తాన్ ఆడిన అన్నీ మ్యాచ్ లలోనూ జైస్వాల్ డామినేషన్ స్పష్టంగా కనిపించింది. ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో విధ్వంసానికి పర్యాయపదంగా జైస్వాల్ బ్యాటింగ్ నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఇక తర్వాత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది.

యశస్వి బ్యాటింగ్ ధాటికి కోల్ కతా విలవిలలాడింది. తొలి బంతి నుంచే బాదడమే లక్ష్యంగా పెట్టుకున్న జైస్వాల్ కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆ తరువాత కూడా ఎక్కడ తగ్గని యశస్వి 47 బంతుల్లోనే 98 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. యశస్వి కి తోడు సంజు శాంసన్ కూడా 29 బంతుల్లో 48 పరుగులు చేసి రాజస్తాన్ విజయనికి బాటలు వేశాడు. అటు యశస్వి ఇటు సంజు శాంసన్ దెబ్బకు కోల్ కతా నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యం కేవలం ఒక్క వికెట్ నష్టంతో రాజస్తాన్ అలవోకగా విజయం సాధించింది.

Also Read: మొబైల్స్ తో జాగ్రత్త గురూ !

ఇక విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన యశస్వి జైస్వాల్ పై మాజీ లు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో టీమిండియాకు యశస్వి విధ్వంసకర ఓపెనర్ అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నేటి ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మరియు గుజరాత్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో గుజరాత్ గెలుపొందింది. ప్రస్తుతం టేబుల్ టాపర్ గా ఉన్న గుజరాత్ ను ముంబై ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ముంబై కూడా ప్రస్తుతం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ఈ నేపథ్యంలో గుజరాత్ పై ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందేమో చూడాలి.

Also Read: IPL 2023:ఢిల్లీపై చెన్నై ఘన విజయం

- Advertisement -