దేశంలో 24 గంటల్లో 41,322 కరోనా కేసులు

76
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 94 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 41,322 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 485 మంది మృతిచెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 93,51,110కు చేరాయి.

ప్రస్తుతం దేశంలో 4,54,940 యాక్టివ్ కేసులుండగా 87,59,969 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.కరోనాతో ఇప్పటివరకు 1,36,200 మంది మరణించారు. అత్యధికంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయని వైద్య,ఆరోగ్య శాఖ తెలిపింది.