మీర్‌పేటలో కారెక్కిన ఇండిపెండెంట్ అభ్యర్థి….

57
errabelli

Ghmc ఎన్నికల్లో మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ 4వ డివిజన్ లో వార్ వన్ సైడ్ గా మారింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభుదాస్ ప్రచారంలో, ప్రజలని కలవడంలో, ఓట్లు అడగడం లో అందరికంటే ముందున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయంగా అభ్యర్థి తో కలిసి డివిజన్ లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

టిఆర్ఎస్ హయాం లో ghmc, డివిజన్ లో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే, ప్రతిపక్షాలను, వాటి విధానాలను ఎండగట్టడంలో సక్సెస్ సాధిస్తున్నారు. దీంతో ప్రతిపక్ష అభ్యర్థులే కాదు, స్వతంత్ర అభ్యర్థులకు కూడా దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో డివిజన్ లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన వి అర్ శ్రీనివాస్ సైతం తన 200 మంది అనుచరులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో కారెక్కేశాడు. తన అనుచరులు 200 మందితో కలిసి తను టీఆరెఎస్ అభ్యర్థి ప్రభుదాస్ విజయం కోసం పని చేస్తామని ప్రకటించారు. మరోవైపు, Aituc సైతం తమ మద్దతును టిఆర్ఎస్ కు ప్రకటించింది. Aituc డివిజన్ నేతలు కొల్లూరు స్వామి, కుమార్ తదితరులు మంత్రి సమక్షంలో టీఆరెఎస్ కు మద్దతు ప్రకటించారు.

అనంతరం భక్షు గూడ లో జరిగిన ప్రచార కార్యక్రమంలో పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలతో సహ, కాలనీ పెద్దలు టిఆర్ఎస్ లో చేరారు. వారు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.ఆ తర్వాత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 4వ డివిజన్ లోని తిరుమల నగర్, తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలిసి ఓట్లు అడిగారు. మంత్రి వెంట అభ్యర్థి, ఇతర నేతలు, కార్యకర్తలు ఉన్నారు.