దేశంలో 70 లక్షలకు చేరువలో కరోనా కేసులు…

160
india corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు 70 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో కరోనా కేసుల సంఖ్య 70 లక్షలకు చేరువయ్యాయి. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 73,272 కేసులు న‌మోదుకాగా 926 మంది మృతిచెందారు.

దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 69,79,424కు చేరగా 8,83,185 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా మహమ్మారి నుండి 59,88,823 మంది బాధితులు కోలకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఇప్పటివరకు 1,07,416 మంది మృతిచెందారు.

దేశంలో ఇప్పటివరకు 8,57,98,698 కరోనా టెస్టులు నిర్వహించగా గత 24 గంటల్లో 11,64,018 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్) తెలిపింది.