గ్రేస్ క్యాన్సర్ రన్ 2020…ప్రారంభించిన ఈటల

116
etela

గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో..గ్రేస్ క్యాన్సర్ రన్ 2020 ను ప్రారంభించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ , సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు.ఈ సందర్భంగా క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం బస్ ను ప్రారంభించారు మంత్రి ఈటల.ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ రోగుల సంఖ్య అధికమవుతోంది.15 శాతం మరణాలు క్యాన్సర్ వల్లనే జరుగుతున్నాయని తెలిపారు.

టెక్నాలజీ పెరిగినా..జీవన విధానంలో మార్పులు, ఆహారుఅలవాట్లు మార్పు, ప్రశాంతత వదిలి పెట్టి డబ్బు కోసం పరిగెత్తు తున్న మాయా ప్రపంచం మనిషికి అనేక జబ్బులను తెచ్చి పెట్టిందన్నారు.క్యాన్సర్ అవగాహన పై ప్రభుత్వంతో తో పాటు అనేకఅంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు పని చేస్తున్నాయి.క్యాన్సర్ భారీ నుండి బయట పడాలంటే ముందుగా గుర్తించడమే మందు అని చెప్పారు.

చిన బాబు, గ్రేస్ ఫౌండేషన్ కి అభినందనలు…తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి స్వచ్చంధ సంస్థ లకు పూర్తి మద్దతు ఉంటుంది.ప్రభుత్వం ఇప్పటికే క్యాన్సర్ ట్రీట్మెంట్ ను ఆరోగ్య శ్రీ లో చేర్చిందని తెలిపారు.