కాళేశ్వరంతో ప్రాజెక్టులకు జలకళ..

183
parvathi barage
- Advertisement -

చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా అన్నీ జలాశయాలు నింపేందుకు కార్యాచరణ అధికారులు చేపట్టారు.దీంతో అన్నీ పంపు హౌజ్ ల లోని మోటార్స్ ను రన్ చేస్తూ గోదావరి జలాలు ఎత్తి పోస్తున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని కన్నేపల్లి పంపు హౌజ్ నుంచి రాజరాజేశ్వర జలాశయానికి గోదావరి జలాలు చేరుకుంటున్నాయి.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మహాదేవపూర్ మండలం కన్నెపల్లి వద్ద నిర్మించిన లక్ష్మీ పంప్ హౌస్ నుండి 6 పుంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్న అధికారులు.
ఒక్కోక్క పంప్ ద్వారా 22 వందల క్యూసెక్కుల జలాలు 13 కిలో మీటర్లు గ్రావిటీ కెనాల్ ద్వారా ప్రయాణించి సరస్వతి, పార్వతి,ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి నంది మేడారం పంపు హౌజ్ ద్వారా గాయత్రి కి చేరుకున్న జలాలు గాయత్రి పంపుల నుండి రాజేశ్వర జలాశయానికి చేరుకుంటున్నాయి.

లింక్ 1 లో లక్ష్మి పంపు హౌజ్ లో 6 మోటార్స్, సరస్వతి పంపు హౌజ్ లో 6 పంపుల ను పార్వతి పంపు హౌజ్ లో 6 పంపుల ను,లింక్ 2 లో నంది పంపు హౌజ్ లో 4 పంపు లను గాయత్రి పంపు హౌజ్ లో 4 పంపుల ద్వారా నీటిని ఎత్తి పోస్తున్నారు. వీలైతే ఈ రోజు సాయంత్రం వరకు ఇంకా కొన్ని పంపులు రన్ చేస్తామని ఈ యన్ సి వెంకటేశ్వర్లు తెలిపారు.

- Advertisement -