కాళేశ్వరం అంటే మేడిగడ్డే కాదు!

9
- Advertisement -

కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే కాదు అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ నేతలు మేడిగడ్డ,కాళేశ్వరంపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని తెలంగాణ భవన్ వేదికగా ఖండించారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు,15 రిజర్వాయర్లు,21 పంప్ హౌజ్ లు,203 కిలోమీటర్ల సొరంగాలు,1531కిలో మీటర్ల కాలువలు,98 కిలో మీటర్ల ప్రెజర్ మెయిన్స్,141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ,530 మీటర్ల ఎత్తుకు నీళ్ల ఎత్తిపోత,240టిఎంసీల వినియోగం, అన్నింటి సమహారమే కాళేశ్వరం అన్నారు కేటీఆర్. ప్రజలకు కాలేశ్వరం ద్వారా అందుతున్న ఫలాలను వివరిస్తాం అన్నారు.

మేడిగడ్డ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ఎండగడతాం అని, మేడిగడ్డలో రెండు మూడు పిల్లర్లకు పగుళ్లు వస్తే ప్రాజెక్టుని మొత్తం కూల్చే కుట్ర చేస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో కడెం ప్రాజెక్టు, గుండ్ల వాగు, మూసి ప్రాజెక్ట్, సింగూర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, పులిచింతల వంటి అనేక ప్రాజెక్టుల్లో సమస్యలు వచ్చాయన్నారు. రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్న రైతు ప్రయోజనాలే అందరికీ ముఖ్యంగా ఉండాలని..కాపర్ డ్యాం నిర్మాణం చేసి వెంటనే మేడిగడ్డకు మరమత్తులు నిర్వహించాలన్నారు.

రానున్న వర్షాకాలంలో మూడు బరాజులను, వచ్చే వరదతో కొట్టుకపోయే విధంగా కాంగ్రెస్ కుట్ర చేస్తుందని,నేరుగా రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు చెప్తున్నారు… అన్నారం, సుందిల్ల కూడా కొట్టుకుపోతుందని చెప్పారు.ఇది ప్రాజెక్టు కొట్టుకుపోవాలని కుట్రపూరిత ఆలోచనలో భాగమేనన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, మేడిగడ్డకు సందర్శన లాంటి అన్ని డ్రామాలు అయిపోయినాయి కాబట్టి ఇప్పటికైనా సమస్య పరిష్కారం పైన దృష్టి పెట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి రైతులపైన… తెలంగాణ పైన ప్రేమ ఉంటే ప్రాజెక్టుకి మరమత్తులు చేసి నీళ్లు ఎత్తిపోయాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ అప్పులపై అడ్డగోలుగా మాట్లాడుతుందని… కాంగ్రెస్‌కి చిత్తశుద్ధి ఉంటే కొత్తగా అప్పులు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడిపించాలని సవాల్ విసిరారు. ఆనాడు నది జిల్లాల కోసం తెలంగాణ ప్రజలు దశాబ్దాల పాటు పోరాడారు…నీళ్ల కోసం, నిధుల కోసం అనేక ఉద్యమాలు చేశారు…బాసర నుంచి భద్రాచలం దాకా పారుతున్న గోదారి జలాల కోసం ఉద్యమాలు నిర్వహించారన్నారు. ఎన్ని ఉద్యమాలు చేసినా గోదావరి నీళ్లను తెలంగాణకు అందించలేక పోయినారు ఆనాటి పాలకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో కేసులు వేసి ప్రాజెక్టు కట్టకుండా అడ్డంకులు సృష్టించింది…ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కేసీఆర్ కి పేరు వస్తుందని దుర్మార్గంగా వ్యవహరించింది…కాంగ్రెస్ కుట్రలకు దాటుకుని 400 పైగా అనుమతులు సాధించాం అన్నారు.

Also Read:బండి సంజయ్‌ది రాజకీయ డ్రామా:పొన్నం

- Advertisement -