సూర్యాపేటలో పొంగిపొర్లుతున్న చెరువులు..

562
cheruvulu
- Advertisement -

నల్లగొండ జిల్లాలో 2080 చెర్వులు ఉండగా ప్రస్తుత వర్షాలకు తోడు ఎస్సెల్బీసీ ,ఏఎంఆర్ పీ ,,సాగర్ నీటితో 70 శాతం చెర్వుల్ని నింపారు.ఇందులో 250 చెర్వులు దాక అలుగులు పొస్తున్నాయి.సూర్యాపేట జిల్లాలో 1270 చెర్వులు…ఉండగా ఎస్సారెస్పీ గోదావరి నీటితో, ప్రస్తుత వానాలతో 700 నిండాయి..70 చెర్వులు అలుగులు పోస్తున్నాయి. యాదాద్రి జిల్లాలో 1160 చెర్వులు ఉండగా మూసి నీటితో ,ప్రస్తుత వానాలతో 800 చెర్వులు నిండాయి. 140 చెర్వులు అలుగులు పోస్తున్నాయి.ప్రస్తుత వానాలతో నల్లగొండ బైపాస్ లోని అద్దంకి టూ నార్కెట్ పల్లి హైవేపై నీరు నిల్చింది… చిన్న చిన్న వాహనాలు రాకపోకలకు ఇబ్బంది అవుతున్నది

సూర్యాపేట జిల్లాలో జాజిరెడ్డి గూడెం మండలం తిమ్మాపూరం గ్రామం వద్ద ఎస్సారెస్పీ కాల్వ గండి పండింది.సూర్యాపేట పట్టణంలోని సద్దల చెర్వు పొంగింది. ఇక యాదాద్రి జిల్లాలో మూసినది మహా ఉద్రుతంగా ప్రవహిస్తున్నది..హైద్రాబాద్ లో కురుస్తున్న వర్షాలకు తోడు స్దానికంగా పడ్తున్న వానతో మూసి ఉగ్రరూపం దాల్చింది.

పొచంపల్లి మండలం భట్టుపల్లి,, చిన్న రావుల పల్లి,,జూలూర్ ,భీమనపల్లి, సంగెం, గ్రామాల్లో బీబీనగర్ మండలంలో కొన్ని గ్రామాల్లో, వలిగొండ మండలంలోని నాగారాం,భీమలింగం పల్లి, ప్రోద్దుటూర్ గ్రామాల్లో మూసి ఉద్రుతంగా ప్రవహిస్తుండంతో కాస్త రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నది.. మూసి పరివాహక ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు.

- Advertisement -