హైదరాబాద్‌లో భారీ వర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం

33
- Advertisement -

ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు కాస్త రిలీఫ్ దొరికింది. భారీ వర్షాలతో హైదరాబాద్‌ లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ఫ్లై ఓవర్‌లు నీటి మయం అయ్యాయి. ఉదయం నుండే భారీ వర్షం కురవడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఉత్త‌ర బంగాళాఖాతంలో ఏర్ప‌డ‌నున్న ఆవ‌ర్త‌న ప్ర‌భావంతో సోమ‌వారం నాటికి అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో రాబోయే రెండు, మూడు రోజుల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావరణ శాఖ వెల్ల‌డించింది.

ఇక ఇవాళ ఉదయం కురిసిన వర్షాలకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, గ‌చ్చిబౌలి, కూక‌ట్‌ప‌ల్లి, హైద‌ర్ న‌గ‌ర్, బాచుప‌ల్లి, ప్ర‌గ‌తి న‌గ‌ర్, నిజాంపేట్, బోర‌బండ‌, యూసుఫ్‌గూడ‌, స‌న‌త్‌న‌గ‌ర్, అమీర్‌పేట‌, మైత్రీవ‌నం, పంజాగుట్ట‌, బేగంపేట‌, సికింద్రాబాద్, తార్నాక‌, ఉప్ప‌ల్ లో రోడ్లపైకి నీరుచేరింది.

Also Read:గుడ్డులోని పచ్చసోనా తింటే ప్రమాదమా?

- Advertisement -