ప్రజల మనిషి రామలింగన్న యాదిలో…

217
ramalingareddy
- Advertisement -

ప్రజల మనిషి రామలింగారెడ్డి యాదిలో గజ్వేల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మంత్రివర్యులు శ్రీ టి హరీష్ రావు గారు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, mlc ఫారూఖ్ హుస్సేన్ గారు, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్దారెడ్డి, దేవిప్రసాద్, ప్రతాప్ రెడ్డి, ఖాజా విరహత్ ఆలి, రంగాచారి హాజరై తమతో ఉన్న స్మృతులని గుర్తు చేస్తూ మాట్లాడటం జరిగింది..

ఈ సందర్భంగా మంత్రివర్యులు హరీష్ రావు గారు బాధతో తనతో ఉన్న స్మృతులని గుర్తు చేస్తూ లింగన్న మృతి ఎంతో బాధించిందని అన్నారు, లింగన్న అని ఆత్మీయంగా పిలిచే మంచి స్నేహితుడంటూ అన్నారు… అన్నదమ్ముల అనుబంధం మా మధ్య ఉండేదని అన్నారు, ఆయనకి ఆత్మవిశ్వాసం ఎక్కువ అని అన్నారు.దురదృష్టవశాత్తు మరణించడం చాలా బాధకారం అన్నారు.

Aig హాస్పిటల్స్ లో కాలి నొప్పితో బాగలేక చేరినప్పుడు అక్కడ డాక్టర్లతో చాలా ప్రేమగా ఉన్నారని ఈ విషయం నాకు స్వయంగా డాక్టర్లు చెప్పారని అలా రామలింగారెడ్డి గారు ఉన్నారని అన్నారు.జర్నలిస్టుల కాలనిలో అత్యంత సాదాసీదా గా ఇల్లు కట్టుకొని నిరంతరం ప్రజాసంక్షేము కోసం పాటుపడ్డారని అన్నారు.కొన్ని వేల మంది ప్రజా హృదయలు గెలిచిన నాయకుడు రామలింగారెడ్డి గారు అన్నారు.

నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేసి తన ఆరోగ్యంపై ఏమాత్రం దృష్టి పెట్టకుండా ప్రజల కోసం అలిచించే గొప్ప నాయకుడు లింగన్న అన్నారు.ఏ సమస్యపైన ఐన చివరి వరకు పోరాటం చేసేవారు అన్నారు..అలాంటి వ్యకికి మనం టికెట్ ఇచ్చి గెలిపించుకోవలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేవారు అని గుర్తు చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా లింగం దుబ్భక వస్తా అని అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేయాలని అనేవారు అని అన్నారు..లింగం అని ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలిచేవారు అన్నారు.

లింగన్న ప్రేమ ముఖ్యమంత్రి గారికి చాలా ప్రేమ ఉండేదని దుబ్భక అభివృద్ధి కి 25 కోట్లు విడుదల చేసిన సంఘటన గుర్తు చేశారు.సాగునీరు , త్రాగునిరు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం లో ఇవ్వడం జరిగిందన్నారు.ఎక్కడ ఉప ఎన్నికలు జరిగిన మేమిద్దరం కలిసి వెళ్ళేవాళ్ళమని అన్నారు.జగన్ రాకను నిరసిస్తూ మనుకోటలో సంఘటన జరిగినప్పుడు లింగారెడ్డి సమైక్య వాదుల ఫ్లెక్సీలను చింపిన సంఘటన గుర్తు చేశారు.
అక్కడ ఫైరింగ్ మరియు రాళ్లయుద్ధం జరుగుతున్నప్పుడు రామలింగారెడ్డి గాయపడిన యువకులను ఎత్తుకొని వరంగల్ హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగిందని అన్నారు.తెలంగాణ ఉద్యమంలో అతి ఎక్కువగా అరెస్టులు కేసులు ఉన్నాయంటే రామలింగారెడ్డి గారు అని గుర్తుచేశారు.ఇంత మంచి నాయకులు మన మధ్యలో లేకపోవడం దుఃఖం వస్తుందని అన్నారు.

- Advertisement -