పవన్ ‘హరి హర వీరమల్లు’ టీజర్ డేట్‌..!

58
Hari Hara Veera Mallu

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చారిత్రక నేపథ్యంలో పవన్ చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ మొగల్ పాలనా కాలం నాటి కథాకథనాలతో రాబోతుంది. ఇందులో వజ్రాల దొంగ పాత్రలో పవన్ నటిస్తున్నాడు. ఆయన సరసన నాయికగా నిధి అగర్వాల్ కనిపించనుంది. ఈ సినిమా కోసం ఆ కాలంనాటి పరిస్థితులకు సరిపోయేలా భారీ సెట్లు వేస్తున్నారు. అందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారట.

కరోనా నేపథ్యంలో ప్రస్తుతం సినిమా షూటింగ్‌ నిలిచిపోయింది. కరోనా పరిస్థితులు చక్కబడగానే తిరిగి షూటింగు మొదలవుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా నుంచి త్వరలో టీజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. అయితే పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, సెప్టెంబర్ 2వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయాలనే ఉద్దేశంతోనే దర్శక నిర్మాతలు ఉన్నారట. అందువలన ఈ మధ్యలో టీజర్ వచ్చే అవకాశం లేదనే అంటున్నారు.