తెలంగాణ‌లోని పలు యూనివ‌ర్సిటీల‌కు వీసీల నియామకం..

187
- Advertisement -

రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లను ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు, యుజిసి నిబంధనలకు అనుగుణంగా, రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్‌ల నియామక ప్రక్రియను చేపట్టి పేర్లను సూచించింది. కరోనా నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగినా, నిబంధనల ప్రకారం అభ్యర్ధుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి గవర్నర్ ఆమోదం కోసం సిఫారసు చేయడం జరిగింది. శనివారం రాష్ట్ర గవర్నర్ వీసీల నియామకానికి ఆమోదం తెలిపారు.ఈమేరకు శనివారం కొత్తగా నియమించబడిన వీసీల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది.

వీసిల నియామకం వివరాలు..

-ఉస్మానియా యూనివ‌ర్సిటీ వీసీగా ప్రొఫెస‌ర్ డి. ర‌వీంద‌ర్ యాద‌వ్.
-కాక‌తీయ యూనివ‌ర్సిటీ వీసీగా ప్రొఫెస‌ర్ టీ. ర‌మేశ్‌.
-తెలంగాణ యూనివ‌ర్సిటీ వీసీగా ప్రొఫెస‌ర్ ర‌వీంద‌ర్ గుప్తా.
-అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ వీసీగా ప్రొఫెస‌ర్ సీతారామరావు.
-పొట్టి శ్రీరాములు తెలుగు యూనివ‌ర్సిటీ వీసీగా ప్రొఫెస‌ర్ కిష‌న్ రావు.
-పాల‌మూరు యూనివ‌ర్సిటీ వీసీగా ప్రొఫెస‌ర్ ల‌క్ష్మీకాంత్ రాథోడ్‌.
-జేఎన్టీయూ వీసీగా క‌ట్టా న‌ర్సింహారెడ్డి.
-మ‌హాత్మాగాంధీ యూనివ‌ర్సిటీ వీసీగా ప్రొఫెస‌ర్ సీహెచ్ గోపాల్ రెడ్డి.
-శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీ వీసీగా ప్రొఫెస‌ర్ మ‌ల్లేశం.
-జ‌వ‌హ‌ర్ లాల్ ఆర్కిటెక్క‌ర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వీసీగా ప్రొఫెస‌ర్ క‌విత ద‌ర్యాని నియమితులైయ్యారు.

- Advertisement -