వీరమల్లు..అప్ డేట్!

186
pawan
- Advertisement -

క్రిష్ డైరెక్షన్‌లో పవర్ స్టార్ పవన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండగా పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. మొఘల్ కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌తో 17వ శతాబ్దానికి చెందిన కథతో వస్తున్నారు పవన్‌. పవన్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను నిర్మాత ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజాగా సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. బుధవారం నుండి క్లైమాక్స్ సీన్స్‌ను చిత్రీకరించేందుకు టీమ్ రెడీ అవుతోంది. ఈ క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరణలో పవన్ కల్యాణ్‌తో పాటు చాలా మంది నటీనటులు పాల్గొననున్నారట.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్ గ్లింప్స్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన వార్ ఎపిసోడ్స్‌ను రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -