పవన్…హరిహర వీరమల్లు అప్‌డేట్!

119
pk
- Advertisement -

క్రిష్ డైరెక్షన్‌లో పవర్ స్టార్ పవన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొంత షూటింగ్ పార్టు పూర్తికాగా తాజాగా భారీ యాక్షన్ సీక్వెన్స్ కు రెడీ అవుతున్నారు పవన్. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండగా భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం పవన్ ఇటీవల కసరత్తులు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

దర్శకుడు క్రిష్ ఈ సినిమాను హిస్టారికల్ మూవీగా తెరకెక్కిస్తుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతుండగా మొఘల్ కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌తో 17వ శతాబ్దానికి చెందిన కథగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నాడు.

పవన్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను నిర్మాత ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

- Advertisement -