మేడారం పూజారి మృతిపట్ల మంత్రి సత్యవతి సంతాపం..

29
minister satyavathi

మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ పూజారి సిద్ధబోయిన సమ్మారావు(28) కరోనా బారిన పడి మృతి చెందారు. పూజారి పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ నెలలోనే ఆయన భార్య కూడా కరోనాతో మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మారావు దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తల్లిదండ్రుల మరణంతో పిల్లల బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.