రైతుకవి వెలపాటి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం..

40
cm kcr

తెలంగాణ పద్యకవి, ప్రభుత్వ విశిష్ట పురస్కార గ్రహీత వెలపాటి రామరెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వ్యవసాయం, రైతు సమస్యలను తన కవిత్వం ద్వారా ఆవిష్కరించిన రైతుకవి వెలపాటి అని సీఎం గుర్తుచేసుకున్నారు. తెలంగాణే ప్రధాన వస్తువుగా రచనా వ్యాసాంగాన్ని సాగించిన వెలపాటి మరణంతో తెలంగాణ ఒక ఉత్తమ సాహితీవేత్తను కోల్పోయిందని సీఎం విచారం వ్యక్తం చేశారు. దివంగత వెలపాటి రామరెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.