ఉచిత పథకాలతో.. నష్టాలు తప్పవా?

39
- Advertisement -

ప్రస్తుతం రాజకీయాల్లో ఉచిత హామీల హవా నడుస్తోంది. పోటాపోటిగా రాజకీయ పార్టీలు ఉచిత హామీలను ప్రకటిస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజలు కూడా ఉచిత పథకాలకు అలవాటు పడుతుండడంతో ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల వేళ ఉచితలే ఎజెండాగా మేనిఫెస్టోలను రూపొందిస్తున్నాయి. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఈ ఉచిత హామీలే ముఖ్యపాత్ర పోషించయనే సంగతి అందరికీ తెలిసిందే. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, రూ.500 లకే వంట గ్యాస్.. ఇలా చాలానే హామీలను ప్రకటించి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఇప్పుడిప్పుడే వాటి అమలు దిశగా కూడా అడుగులు వేస్తోంది. అయితే ఈ ఉచిత పథకాల వల్ల నష్టాలే అధికమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఎందుకంటే ఉచిత పథకాల వల్ల ఆర్థిక వృద్ధి రేటు భారీగా దెబ్బ తింటుందని,ఆ తర్వాత అప్పుల భారం పెరిగి పెను ఆర్థిక సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. ఉచిత పథకాలపై తాజాగా ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ఖడ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉచిత పథకాల పేరుతో రాజకీయలు చేయడం వ్యయ ప్రాధాన్యతలను మార్చుకోవడమేనని ఆయన అన్నారు. ప్రజలను శక్తివంతంగా తయారు చేయాలని అలా కాకుండా వారి జేబులకు భరోసా ఇవ్వడం కాదని జగదీప్ ధనఖడ్ అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ముఖ్యంగా సౌత్ లో ఈ ఉచిత పథకాల హవా గట్టిగా నడుస్తోంది. నిన్న మొన్నటి వరకు ఏపీలో ఉచిత పథకాలు ఎక్కువగా అమలవుతుండగా.. ఇప్పుడు తెలంగాణలో అంతకు మించి అనేలా ఉచితాలు అమలవుతున్నాయి. మరి ముందు రోజుల్లో ఈ ఉచిత పథకాల వల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read:Vishal:యాక్షన్ హీరో పెళ్లికి రంగం సిద్ధం

- Advertisement -