కరోనాతో అధైర్య పడకండి..అండగా ఉంటాం:గాదరి కిశోర్

113
gadari kishore

కరోనాతో అధైర్య పడవద్దు…అండగా ఉంటామని తెలిపారు తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్. యాదాద్రిభువనగిరి జిల్లాలోని అడ్డగూడూర్ మండలం డి.రేపాక గ్రామంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్ధాయిలో పర్యటించారు.

గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. వైద్య పరీక్షలు చేయించుకోవాలని ప్రజలను కోరారు. వైద్య సిబ్బందిని మరింత పెంచాలని అధికారులకు సూచించిన కిశోర్…. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులను ధరించాలన్నారు. ఎప్పటికప్పుడు హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని గ్రామంలో పిచికారీ చేయించాలని అధికారులను ఆదేశించారు.