గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే గాదరి కిషోర్..

33
MLA Gadari Kishore

తుంగతుర్తి శాసన సభ్యులు గాదరి కిషోర్ గురువారం పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ ఎమ్మెల్యేకు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ హరిత తెలంగాణ స్వప్నం సాకారం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని ఎంపీ సంతోష్ కుమార్ కోరారు.

ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు తన పుట్టినరోజు పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు ఎమ్మెల్యే గాదరి కిషోర్‌. పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి, మొక్కలను నాటాలని పిలుపునిచ్చిన ఎంపీ సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.