ఎమ్మెల్యే కిశోర్‌కు సీఎం కేసీఆర్ పరామర్శ

68
kcr

నల్గొండలోని పీటీఆర్ కాలనీలోని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు సీఎం కేసీఆర్. కిషోర్ తండ్రి మారయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సీఎం కేసీఆర్.

సీఎంతో పాటు మంత్రులు జగదీష్ రెడ్డి, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్,ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు.