దేశంలో ఉచితంగా కరోనా వ్యాక్సిన్: కేంద్రం

243
covid 19
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్న సంగతి తెలిసిందూ. రోజుకు దాదాపు 70 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా కేసుల సంఖ్య 30 లక్షలు దాటాయి.

ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది.ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని దీనిని ప్రజలకు ఉచితంగా అందిస్తామని తెలిపింది కేంద్రం.ఆక్స్ ఫర్ట్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవీషీల్డ్ వ్యాక్సిన్ మరో 73 రోజుల్లో అందుబాటులోకి రానుందని, సీరమ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన అధికారులు తెలిపారు.

మూడో దశ క్లినికల్ ట్రయల్స్ శనివారం ప్రారభమయ్యాయని మరో 29 రోజుల తరువాత రెండో డోస్ ఇస్తామని, దాని తరువాత 15 రోజల్లోనే ఫలితాల వెల్లడి ప్రారంభం అవుతుందదని వారు తెలిపారు.దేశంలోని 130 కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ వేసేందుకు 68 కోట్ల డోస్‌లను వచ్చే సంవత్సరం జూన్ నాటికి అందించే దిశగా ప్రణాళికలు సిద్దం చేసింది. హడావుడిగా వ్యాక్సిన్ ఇవ్వాలని భావించడం లేదని, దాని భద్రత, సమర్ధతను పూర్తిగా పరిశీలించిన తరువాతే విడుదల చేస్తామని భారత్ బయోటెక్ సీఎండీ ఎల్లా కృష్ణ ఇప్పటికే వెల్లడించారు.

- Advertisement -