దేశంలో 30 లక్షలు దాటిన కరోనా కేసులు…

198
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు 60 వేలకు పైగా కరోనా కేసులు నమోదువుతండగా వెయ్యికి పైగా మృత్యువాత పడుతున్నారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 30 లక్షలు దాటాయి.

గత 24 గంటల్లో 69,239 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 912 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 30,44,941కి చేరగా కరోనాతో ఇప్పటివరకు 56,706 మంది మృత్యువాతపడ్డారు.

ప్రస్తుతం దేశంలో 7,07,668 యాక్టివ్ కేసులుండగా 22,80,567 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో ఇప్పటివరకు కరోనా టెస్టుల సంఖ్య 3 లక్షలు దాటాయి.