దుబ్బాక కాలువ పనులు వేగవంతం చేయండి: హరీష్ రావు

247
harishrao
- Advertisement -

సిద్దిపేట జిల్లా దుబ్బాక కాలువ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు మంత్రి హరీష్ రావు.హైదరాబాద్ లోని ఎంసీహెచ్ఆర్డీలో ఇరిగేషన్, రెవన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్…దుబ్బాక కెనాల్ నిర్మాణం కోసం 552 ఎకరాల భూసేకరణ ను అత్యంత ప్రాధాన్యతా అంశంగా తీసుకోవాలన్నారు. – దుబ్బాక కెనాల్ కు సంబంధించిన 17 డిస్ట్రిబ్యూటరీలక కోసం 850 ఎకరాల భూసేకరణ వెంటనే చేపట్టాలి…. జిల్లా కలెక్టర్ సెప్టెంబర్ తొలి వారంలోగా ఈ భూములు ఇరిగేషన్ శాఖకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేసేందుకు జేఈ, ఈఈ, ఎస్. ఈలు. కాళేశ్వరం ఈ ఎన్.సీ హరిరామ్ లు సమన్వయంతో పనులు చేపట్టాలి… మెయిన్ కెనాల్ 46 కిలోమీటర్లకు గాను కెనాల్ లైనింగ్,స్ట్రక్టర్స్ 16 కిలోమీటర్ల వరకు పూర్తి చేయడం జరిగింది. మిగిలిన 39 కిలోమీటర్ల బ్యాలెన్సింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ పను ల కోసం 22 PAWER పెట్టి అక్టోబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలి. డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులు సైతం పూర్తి చేయాలి.అధికారులు నిరంతరం క్షేత్ర స్థాయిలో పనులు జరుగుతున్న తీరును పరిశీలించాలన్నారు. గుత్తేదారులు పనులు ఆపకుండా పర్యవేక్షణ జరపాలన్నారు.

- Advertisement -