తెలుగు మహాసభలు..మెను ఇదే

262
Food Menu At Prapancha Telugu Mahasabhalu
- Advertisement -

తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేలా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దేశ,విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక మహాసభల విజయవంతానికి కమిటీలను వేసిన ప్రభుత్వం…తెలుగు రుచులతో విదేశీ ప్రతినిధుల నోరూరించేందుకు సిద్దమైంది.

సంప్రదాయ తెలుగు వంటకాలతో పాటు ప్రత్యేకంగా తెలంగాణకే పరిమితమైన రుచులను సిద్ధం చేస్తున్నారు. వేలాది మంది ప్రతినిధులు తెలుగు భాషా సాహిత్యంతో పాటు ఇక్కడి రుచులను ఆస్వాదించనున్నారు. 5 రోజుల పాటు రోజుకో రకం చొప్పున వంటలు సిద్ధం చేస్తున్నారు. సభల ప్రారంభం  నుంచి ముగింపు వరకు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి భోజనాలకు ప్రత్యేకంగా వంటకాలు వడ్డించనున్నారు.

 telangana food

సభకు హాజరైన ప్రతినిధులకు పొద్దున 7.30 కు ఇడ్లీ, వడ, ఉప్మా, పొంగలి, దోసె…. కాఫీ, టీ ఇవ్వనున్నారు. 11.30 కు బ్రేక్ లో టీ, బిస్కెట్లు ఇస్తారు. మళ్లీ సాయంత్రం 4.30 కు టీ, కాఫీ, బిస్కెట్స్, మైసూర్ బజ్జీ, వడలు, సమోసా ఇస్తారు. రాత్రి 9.30 కు భోజనం వడ్డిస్తారు.

ఇక మధ్యాహ్నం, రాత్రి 40 రకాల వంటకాలు సిద్ధం చేస్తున్నారు.  మెనూలో ఓ నార్త్ ఇండియన్ వంటకాలతో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వంటలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ బిర్యానీతో పాటు  తెలంగాణకే సొంతమైన పచ్చి పులుసు, టమాట రసం, కందగడ్డ పులుసు, మజ్జిగ చారు, దాల్చా, చింతపండు పులిహోర, జొన్నరొట్టె, మక్కగారెలు, సకినాలు, కద్దుఖీర్, బక్షాలు వంటివి అతిధులకు రుచి చూపించనున్నారు.

- Advertisement -