Heat Wave:హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్

11
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో సోమవారం, మంగళవారం ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రాత్రి సమయంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. పలుచోట్ల వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది..

తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో రాగల 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో సాధారణం కంటే వేడిగా ఎక్కువగా నమోదైందని తెలిపింది.

Also Read:TDP:వాలెంటిర్లకు ‘టీడీపీ’ ముప్పు?

- Advertisement -