ఒకే ఒక్క పెగ్గు.. మగువల ‘మంద’డుగు!

232
India-Alcohol-
- Advertisement -

మద్యం అనగానే ముందుగా మనకు మగవాళ్లే గుర్తుకువస్తారు. మద్యానికి బానిసులైన మగవాళ్లను తరచూ చూస్తునే ఉంటాం. దానిని వ్యతిరేకిస్తూ.. మహిళలు ఉద్యమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పటికీ ఒకవైపు కొందరు మహిళలు మద్యం నిషేధించాలని ధర్నాలు, రాస్తారోకోలు చేస్తోంటే.. నేటి తరం యువతులు మాత్రం మద్యం సేవించడం స్టేటస్ సింబల్ గా ఫీలౌతున్నారు.

bigstock-Cheers

మగువలు అభిరుచుల విషయంలోనూ.. అనుకున్నది చేయడంలోనూ ఏమాత్రం సిగ్గు పడటం లేదు. అది తప్పా.. ఒప్పా అన్న సంగతి పక్కనబెడితే.. మంచితో పాటే అన్ని దురలవాట్లకు చేరువవుతూ మగాళ్ల కంటే వేగంగా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.మద్యపానం, ధూమపానం, విచ్చల విడిగా శృంగారం, జూదం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో. చదువు, ఉద్యోగాల పేరిట తల్లిదండ్రులకు దూరంగా ఉండటంతో.. చెడు స్నేహాలకు అలవాటుపడి ఇరుగుపొరుగు చూస్తారన్న భయం లేకుండా మద్యాన్ని రుచి చూస్తున్నారు.

womens drink

తాజాగా జరిగిన జాతీయ కుటుంబ సర్వేలో మనదేశంలో మద్యం తాగే మహిళల శాతం పెరిగినట్లు తేలింది. 2005-06వ సంవత్సరం నాటికి మద్యం సేవించే మహిళల శాతం 0.4గా ఉండగా.. 2015-16 నాటికి ఇది 0.7 శాతానికి పెరిగింది. అదే సమయంలో 2005-06లో మద్యం సేవించే పురుషుల శాతం 33.1 శాతం.. 2015-16 నాటికి 24.7 శాతానికి తగ్గడం విశేషం. కానీ అమ్మాయిలు మాత్రం చుక్క వేయకుండా ఉండలేకపోతున్నారట. చదువు, ఉద్యోగాల కోసం ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళుతున్నారు. అలాంటి సందర్భాల్లో ఎక్కువగా వీటికి అలవాటు పడుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -