టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా… ఆరేళ్ల పిల్లగాడు సంవత్సరానికి 70 కోట్లు సంపాదిస్తున్నాడా.. ఇది ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా… అవును ఇది నిజం.. ఈ బుడ్డొడి సంవత్సరాదాయం 70కోట్ల రూపాయలు. ఇది నమ్మశక్యంగా లేకపోయినా నమ్మితీరాల్సిందే… ఈ పిల్లగాడు బొమ్మలతో ఆడుకుంటూనే ఇన్ని కోట్లు సంపాదిస్తున్నాడు..అతడి పేరు ర్యాన్.

ఇంతకు ఈ బుడతడు అంత ఆదాయం ఎలా సంపాదిస్తున్నాడంటే.. పిల్లలకు బొమ్మలంటే ఇష్టం ఎలాగో ర్యాన్‌కు అంతే.. కాకపోతే అది కాస్త ఎక్కువ. ఒక బొమ్మ అతని చేతికి చిక్కిందంటే దానిని క్షణ్ణంగా పరిశీలిస్తాడు. అదేంటో.. దాంట్లో ప్రత్యేకతలు ఏంటో పూర్తిగా అధ్యయనం చేసి వివరిస్తుంటాడు. నాలుగేళ్ల వయసులో అతని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు వీడియోలు తీసి.. ర్యాన్ టాయ్స్‌రివ్యూ అనే ఓ ట్యూబ్‌ఛానెల్‌ను సృష్టించి అందులో ఆ వీడియోలను అప్ డేట్ చేస్తూ వస్తున్నారు. ఆ ఛానెల్‌కు 10 లక్షల మందికిపైగా సబ్ స్క్రైబర్‌లు ఉన్నారు. ర్యాన్ వీడియోలను చూసే చాలా మంది చిన్నారులు బొమ్మలు కొంటుంటారు కూడా. వాటి డెమో ఇచ్చే సమయంలో అతని హవాభావాలు భలేగా ఉంటాయి. ఈ వీడియోలను గానూ అతనికి సదరు కంపెనీల నుంచి పెద్ద మొత్తంలోనే ముడుతోంది. ఈ ఏడాదికి గానూ11 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.70 కోట్లకు పైగా సంపాదించాడు. ఇటీవల ఫోర్బ్స్ యూట్యూబ్ లో కోట్లు సంపాదిస్తున్న వారి జాబితాను విడుదల చేయగా.. ఈ బుడ్డాడు ఆ జాబితాలో 8వ స్థానంలో నిలిచాడు.

మొత్తానికి ఈ బుడ్డొడు గట్టోడే కదా.. పెద్దవారికే సాధ్యం కానీ ఈ పనిని ఆరేళ్ల వయసులోనే సాధించి అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు.

