గీత కార్మికుడికి మంత్రి ఎర్రబెల్లి పరామర్శ..

37
minister errabelli

ఇటీవల ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి పడి నిమ్స్ హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న తన డ్రైవర్ భీమగాని అనిల్ తండ్రి భీమగాని శ్రీనివాస్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ కి అందుతున్న వైద్య సేవల గురించి నిమ్స్ వైద్యులతో చర్చించారు. మెరుగైన మంచి వైద్యం అందించాలని ఆదేశించారు. అనిల్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.