ఇంగ్లండ్ 205 ఆలౌట్..

320
England all out
- Advertisement -

అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 205 పరుగులకు ఆలౌట్ అయింది. మూడో టెస్టుతో పోల్చితే కాస్త మెరుగ్గా ఆడిన ఇంగ్లండ్ టాస్ గెలిచిన ఆధిక్యతను మాత్రం నిలుపుకోలేకపోయింది. తొలిరోజు చివరి సెషన్ ముగియకముందే వికెట్లన్నీ కోల్పోయింది.

టీమిండియా స్పిన్నర్లు అక్షర్ పటేల్ (4/68), అశ్విన్ (3/47), సుందర్ (1/14) మరోసారి బంతిని గింగిరాలు తిప్పగా, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ (2/45) కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ (5), జానీ బెయిర్ స్టో (28)లను పెవిలియన్‌కు పంపాడు.55 పరుగులు చేసిన బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. డాన్ లారెన్స్ 46 పరుగులు, ఓల్లీ పోప్ 29 పరుగులతో రాణించారు. అయితే వీరు టీమిండియా స్పిన్ ఉచ్చులో చిక్కుకుని పెవిలియన్ చేరారు.

- Advertisement -