ప్రభాస్‌కు జోడీగా కీర్తి సురేష్..!

43
Keerthy Suresh

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్‌ మూడు భారీ బడ్జెట్‌ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇందులో రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. సలార్ షూటింగ్‌లో దశలో ఉంది. ఇక త్వరలోనే ఆదిపురుష్ను ప్రారంభించనున్నాడు ప్రభాస్‌. ఈచిత్రం రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు.

ఇక, ఈ సినిమాలో సీత పాత్ర పోషించేది ఎవరనేది సినీ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. ఆ మధ్య కృతి సనన్, అనుష్కా శెట్టి పేర్లు వినిపించాయి. తాజాగా కీర్తి సురేష్ పేరు తెర మీదకు వచ్చింది. మహానటితో జాతీయ అవార్డు సాధించి బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తున్న కీర్తిని సీత పాత్రకు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్టు సమాచారం.