కరోనా కొంత వరకు వ్యాప్తి తప్పదు కానీ..!

271
Dr Vijay Yeldandi
- Advertisement -

ప్రస్తుత తరుణంలో కరోనా వైరస్ వ్యాప్తి కొంత వరకు తప్పదు.. కానీ భయ పడాల్సిన అవసరం లేదని చికాగో లోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ క్లినికల్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ అండ్ సర్జరీ, ఇన్ఫెక్షియస్ డిసీసెస్/ ట్రాన్సప్లాంట్ ఇన్ఫెక్షియస్ డిసీసెస్, అమెరికాలోని ప్రతిష్టాత్మక సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ ( సీడీసీ ) ( ఇండియాలో ఐ సి ఎం ఆర్ లాంటిది ) అనుబంధంగా ఉన్న డాక్టర్ విజయ్ ఎల్దండి స్పష్టం చేశారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ అధికార నివాసంలో వినోద్ కుమార్‌తో డా. విజయ్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా కొవిడ్-19పై వారిద్దరి మధ్య సుదీర్ఘ సమాలోచనలు జరిగాయి.కరోనా అంటేనే ప్రజలు భయపడుతున్నారని, ఈ విషయంలో ధైర్యంతో, ఆత్మ విశ్వాసంతో ఉండాలని డా. విజయ్ సూచించారు.లాక్ డౌన్ ఎత్తివేతకు, కరోనా కేసులు పెరగటానికి ఏమాత్రం సంబంధం లేదని డాక్టర్ విజయ్ స్పష్టం చేశారు.

లాక్ డౌన్ అన్నది టేప్ రికార్డర్ లో పాజ్ బటన్ లాంటిదని అన్నారు.కాలానుగుణంగా కరోనా వ్యాప్తి కొంత వరకు తప్పదు అని.. మొదటి దశలో జులై,ఆగస్టు వరకు పతాక స్థాయికి చేరుకుని తగ్గుముఖం పడుతుందని, ఆ తర్వాత తిరిగి నవంబర్ నెలలో రెండో దశ ప్రభావం చూపుతుందని విజయ్ వెల్లడించారు.కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉన్నా భయపడవద్దు అని అన్నారు. కరోనా వైరస్ సోకితే సరైన మందులు తీసుకుని ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకోవచ్చని, ఖచ్చితంగా ఆసుపత్రిలోనే ఉండాల్సిందే అన్న నియమం ఏమీ లేదన్నారు.

జ్వరం, తలనొప్పి, వాంతులు, విరోచనాలు, అతి నీరసం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య పరీక్షలు జరిపించుకుని, వైద్యులు సూచించిన మందులు ఇంటి వద్దనే ఉండి వాడొచ్చు అని డా. విజయ్ తెలిపారు. హైబీపీ, షుగర్, కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళు, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. గాలి, వెలుతురు ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు.మాస్క్ లు విధిగా ధరించి, భౌతిక దూరం పాటిస్తే కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం తగ్గుతుందని పేర్కొన్నారు. సామూహికంగా, గుంపులుగా జనం చేరే పెళ్లిళ్లు, శుభ కార్యాలు, పూజలు, ప్రార్థనలు, అంతిమ యాత్రలు వంటి ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నా.. కరోనా వైరస్ ను కొని తెచ్చుకోవడమే అవుతుందని డా. విజయ్ పేర్కొన్నారు.

- Advertisement -