సీఎం కేసీఆర్‌పై తప్పుడు ప్రచారం చేస్తే ఇక ఊరుకోం..

18

తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ మీద బీజేపీ నాయకులు ఆబండాలు వేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా చెప్పాలి అన్నారు. ఇక్కడకి వచ్చిన బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు పాలిస్తున్న రాష్ట్రాలతో తెలంగాణను పోల్చుదాం చర్చకు మేము రెడీ అని సవాల్‌ చేశారు. రైతు భీమా ,రైతు బంధు,ఆసరా పెన్షన్, కళ్యాణ లక్ష్మీ,కేసీఆర్ కిట్, ఫ్రీ డబుల్ బెడ్ రూమ్,బీడీ వర్గాలకు పెన్షన్,ఎస్సి,ఎస్టీ, బీసీలకు రెసిడెన్షియల్ స్కూల్లు ఇలాంటి పథకాలు మా దగ్గర ఉన్నట్టు దేశంలో ఎక్కడ లేవు అని పేర్కొన్నారు. మా రాష్ట్రంలో ఉన్నన్నీ రెసిడెన్షియల్ స్కూల్‌లు… మీ నాలుగు రాష్ట్రాలో ఉన్న స్కూల్లు కలిపిన మా అంత ఉండవు.

మీ కేంద్ర ప్రభుత్వ అధికారులను అడగండి మా అభివృద్ధి ఎలా ఉందో చెపుతారు.మా దగ్గరకి వేరే రాష్ట్రాల అధికారుల వారు వచ్చి అభివృద్ధి చూస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్‌ఎస్‌ మీటింగ్ కు వస్తే బండి సంజయ్ అరెస్ట్ అయితే వచ్చారని ప్రచారం చేస్తున్నారు. కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, నడ్డా మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అభినందించారు అని వినోద్‌ గుర్తు చేశారు. బీజేపీని తెలంగాణలో ఉన్న జనాలు నమ్మరు. తెలంగాణ అంటే ఏంటిదో విమానంలో వచ్చి చూసుడు కాదు… హెలికాప్టర్‌లో తిరగండి తెలుస్తుంది. గతంలో ఉన్న పాలమూరుకు ఇప్పుడు ఉన్న పాలమూరుకు చాలా తేడా ఉంది. మేము ఆహ్వానిస్తున్నాం బీజేపీ పాలిత ముఖ్యమంత్రులకు నాలుగు హెలికాప్టర్‌లు పెడుతాం తెలంగాణ అంత చూసి రండి అని సూచించారు.

బీజేపీకి ఒక్క ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం కూడా లేదు. జన్ ధన్ ఏమైంది,ఫసల్ భీమా పథకంలో పస లేదు. తెలంగాణ ప్రభుత్వంపై , సీఎం కేసీఆర్‌పై తప్పుడు ప్రచారం,అబండాలు చేస్తే ఇక నుండి మేము ఊరుకోము. మేము కూడా తప్పుడు ప్రచారాలను తిప్పి కొడతామని దుయ్యబట్టారు. బ్యాంక్ లను దోచుకుంది అంత గుజరాత్ వాళ్ళు…దేశం సంపద అంత గుజరాత్ వాళ్ళ దగ్గరే ఉంది. మమ్ములను కాదు బండి సంజయ్… బ్యాంక్ లను దేశాన్ని దోచుకున్న గుజరాతీ లను ప్రశ్నించు బండి సంజయ్ అని ఎద్దేవ చేశారు. గతంలో ఉన్న ప్రధానులు దేశం కోసం చాలా కృషి చేసారు.. వీరు కృషి తక్కువ ప్రచారం ఎక్కువ. దేశ భక్తి బీజేపీ పేటంట్ కాదు తెలిపారు. రామజన్మభూమి టెంపుల్ కడుతామని చెప్పి ఓట్లు దండుకున్నారు.. మేము ప్రచారం చేయలేదు కానీ యాదాద్రి కట్టాము. బీజేపీ ప్రభుత్వ సంస్థలను ప్రయివేటికరణ చేస్తోంది..బీజేపీ అంటేనే సామాన్య ప్రజా వ్యతిరేక పార్టీ అని బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు.