యువతను రెచ్చగొట్టొద్దు.. బీజేపీ ఎంపీలకు వినోద్‌ హితవు..

128
b vinod kumar
- Advertisement -

బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌ల వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పండిపడ్డారు. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పొందుపరచబడ్డ 22 భాషల్లో ఏ భాషలోనైనా సివిల్ సర్వీసెస్ పరీక్షలు లేదా ఆయా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసే హక్కు భారత పౌరులకు ఉంటుంది. దురదృష్టం ఏమంటే పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అరవింద్ గానీ రాజ్యాంగం పట్ల అవగాహన లేకుండా, వాస్తవాలను గమనించకుండా, రాజ్యాంగం గురించి తెలుసుకోకుండా యువతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం బాధాకరం.

ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన 2014 నుంచి 2022 వరకు జారీ అయిన యూపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ నోటిఫికేషన్లో ఉర్దూలో కూడా పరీక్షలు రాయవచ్చు అని స్పష్టంగా పేర్కొనబడింది. కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉర్దూలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించారు. వాస్తవాలను దాచిపెట్టి యువతను రెచ్చగొట్టడం మానుకోవాలని బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అరవింద్ సూచిస్తున్నాను.

- Advertisement -