మొక్కలు నాటిన దేత్తడి హారిక

345
harika green challeange

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గోని మొక్కలు నాటుతున్నారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా హీరో నవీన్ కుమార్ (అభయ్ భేతిగంటి) ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించారు యూట్యూబ్ ఫేమ్ దేత్తడి హారిక. ఈసందర్భంగా జూబ్లిహిల్స్ లోని పార్క్ లో మూడు మొక్కలు నాటారు.

ఈసందర్భంగా హారిక మాట్లాడుతూ.. ఇప్పటికే మనం చాలా ఆలస్యం చేశామని పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని మనం అందరం మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అలాగే నాటిన మొక్కలను మనమే సంరక్షించుకోవాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మరో ముగ్గురికి మొక్కలు నాటాలని సవాల్ విసిరారు. 1)ప్రముఖ యాంకర్ రవి 2)రేడియో జాకీ చైతు 3)సింగర్ సాకేత్ లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.