గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గోన్న గాయని సోని కొండూరి

21
sony konduri

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా సాగుతుంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు గాయని సోని కొండూరి. సింగర్ పర్ణిక ఇచ్చినన ఛాలెంజ్ ను స్వీకరించి మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ లు పాల్గోన్నారు.

ఈసందర్భంగా సింగర్ సోని మాట్లాడుతూ… రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా గొప్పదని అన్నారు. నేను మా ఇంట్లో మొక్కలు పెంచుతు ఉంటానని తెలిపింది. భవిష్యత్ తరాలకు మనం ఏదైనా ఇవ్వాలి అంటే అది మంచి వాతావరణంమే కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనం పెంచడం కోసం కృషి చేయాలని ఇది మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తాను మరో ముగ్గురికి మొక్కలు నాటాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు. 1.ఆట సందీప్, 2.సింగర్ హారిక, 3. పృథ్వి చంద్రలను మొక్కలు నాటాలని కోరారు.