గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన సింగర్ సాకేత్

190
saketh
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా దేత్తడి హారిక ఇచ్చిన సవాల్ ను స్వీకరించారు సింగర్ సాకేత్. ఈసందర్భంగా నేడు జూబ్లిహిల్స్ లో మూడు మొక్కలు నాటారు. ఈసందర్భంగా సాకేత్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఇంత పెద్ద కార్యక్రమాన్ని మొదలుపెట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

చెట్లను పెంపే కార్యక్రమం చాలా మంచిది అన్నారు. తనకు కూడా మొక్కలు నాటడం అంటే చాలా ఇష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గోన్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ ను మరో ముగ్గురికి సవాల్ విసురుతున్నట్లు తెలిపారు. 1.ప్లే బ్యాక్ సింగర్ దినకర్, 2. పర్ణిక,3. యాక్టర్ అండ్ సింగ్ కౌముదిలను మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -