జయరాజ్, ఫీనిక్స్ లకు సెలబ్రిటీల సంతాపం..

464
Jeyaraj And Fenix

పోలీసులు ప్రాణాలు కాపాడాల్సింది పోయి.. ప్రజల ప్రణాలను తీస్తున్నారు. మానవత్వాన్ని మరిచిపోయి హత్యలు చేస్తున్నారు. ఇటీవల చెన్నైలో ఓ సాదారణ తండ్రి కొడుకులను విచక్షణారహితంగా చితకబాది వారి మరణానికి కారణం అయ్యారు . ఒక్కరోజులో తండ్రి కొడుకుల ప్రాణాలు పొట్టనబెట్టుకొని బాధిత కుటుంబ పొట్టనుగొట్టారు. ఈ ఘటన తమిళనాడు లోని సతన్ కులం పోలీస్ స్టేషన్ పరిదిలో జరిగింది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. కొద్దిరోజుల క్రితం తమిళనాడులోని కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో మరోసారి లాక్ డౌన్‌ విధించింది అక్కడి ప్రభుత్వం. అయితే తమిళనాడులోని సతన్ కులం ప్రాంతంలో నివాసం ఉండే జయరాజ్ (59) అతని కుమారుడు ఫెనిక్స్ (31) మొబైల్ షాప్ నడుపుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. జూన్ 19న లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికి వారు కరోనా నియమాలు ఉల్లంఘించి షాప్ తెరిచే ఉంచారు దీన్ని గమనించిన సతన్ కులం పోలీసులు జయరాజ్ ఫెనిక్స్ లను విచక్షణారహితంగా చితకబాదారు. 59 వయసున్న వృద్ధుడని కనికరం కూడా లేకుండా కేవలం కొన్ని నియమాలు ఉల్లంఘించినందుకు స్పృహ కోల్పోయెంతవరకూ చితకబాదారు.

దీంతో వారిని దగ్గరలోని కోవిల్ పట్టి ఆసుపత్రులకు తరలించగా చికిత్స పొందుతూ జూన్ 22 న కొడుకు ఫెనిక్స్ ప్రాణాలు విడిచాడు, తండ్రి జయరాజ్ పరిస్థితి కూడా క్షీణించి మరునాడు జూన్ 23 న ఆయన కూడా మృతిచెందాడు. కేవలం 24 గంటల పరిదిలో రెండు ప్రాణాలను కోల్పోయిన కుటుంబం దుక్కసాగరంలో మునిగిపోయింది. విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ క్రుంగిపోతున్నారు, ఈ ఘటన పై ఇప్పటికే పెద్ద స్థాయిలో నెటిజన్లు సానుభూతిని వ్యక్తం చేస్తుండగా సెలబ్రిటీలు సైతం తమ తమ సానుభూతులను తెలుపుతున్నారు.