రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను కలిసిన కాంగ్రెస్ ప్రతినిధుల బృందం

45
rahul

లఖింపుర్ ఖేరి ఘటనపై రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్‌ను కలిసింది కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం. రాష్ట్రపతితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే.

కేంద్రమంత్రిగా ఉన్న అజయ్‌ మిశ్రను తొలగించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అజయ్ మిశ్రా పదవిలో ఉన్నంత కాలం దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగదన్నారు. ఇద్దరు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీలతో విచారణ జరిపించాలన్నారు.

దేశంలో రైతులు, ఎస్సీలు, మహిళలకు న్యాయం జరగడం లేదని…ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారన్నారు. రాష్ట్రపతి సానుకులంగా స్పందించారని..కేంద్ర ప్రభుత్వంతో ఈ వ్యవహరాన్ని చర్చిస్తానని హామీ ఇచ్చారని వెల్లడించారు.