తెలంగాణ వెదర్ అప్‌డేట్..

101
ts
- Advertisement -

రాగల మూడురోజుల వరకు రాష్ట్రంలో వాతావరణ విశ్లేషణ, సూచన మరియు హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నిన్న హనమకొండ వరకు విరమించిన నైరుతి రుతుపవనాలు ఈ రోజు తెలంగాణా రాగల 24 గంటలలో మరికొన్ని భాగాల నుంచి విరమించే అవకాశం ఉందని వెల్లడించింది.

ఈ రోజు ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాలలో స్థిరంగా కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిమి ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తు కి వెళ్ళే కొలదీ నైరుతి దిశ వైపుకి వంపు తిరిగి ఉన్నది.ఈ అవర్తనము ప్రభావం వలన తూర్పు మధ్య బంగాళా ఖాతం మరియు పరిసరప్రాంతాలలో రాగల 24 గంటలలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి 24 గంటలలో దక్షిణ ఒడిస్సా- ఉత్తర కోస్తా ఆంధ్రా తీరంకిచేరుకునే అవకాశం ఉందని తెలిపింది.

ఈ రోజు ఉపరితల ఆవర్తనం కోస్తాకర్నాటక తీరంలోని తూర్పు మధ్య అరేబియా సముద్ర పరిసర ప్రాంతాల నుండి తెలంగాణా వరకు సగటు సముద్ర మట్టంకి 0.9 కిమి ఎత్తు వరకు వ్యాపించి ఉందని వెల్లడించింది. ఈ రోజు, రేపు తెలంగాణా రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి మరియు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది.

- Advertisement -