విత్తన గణపతి కార్యక్రమం భేష్:కలెక్టర్ శరత్ కుమార్

249
collector sharath
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక హరిత తెలంగాణ ఎలక్షన్ గా కొనసాగుతున్నా మొక్కలునాటే కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ తోడ్పాటు నందిస్తున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 10 మొక్కలను నాటారు.

ఈ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ మంచి ఆశయంతో చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందని అన్నారు. నూతనంగా విత్తన గణపతి కార్యక్రమం తో పర్యావరణ పరిరక్షణ ఏర్పడుతుందని అన్నారు. కామారెడ్డి జిల్లాలో విత్తన గణపతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పది మొక్కలను నాటుతూ మరో పది మందికి ఛాలెంజ్ విసిరారు. కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్లు యాది రెడ్డి, వెంకటేష్ దోత్రె, నిజామాబాద్, నిర్మల్, ములుగు, సిద్దిపేట, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, నాగర్ కర్నూల్, ఖమ్మం జిల్లా కలెక్టర్లను నామినేట్ చేస్తూ మొక్కలు నటాల్సిందిగా కోరారు కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్. కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి చేరే విధంగా జిల్లాలో నిర్మిస్తున్న రైతు వేదికల వద్ద ఆ క్లస్టర్ లోని ఆదర్శ రైతు, రైతు బంధు సమితి కన్వీనర్ లు ఇద్దరు కలిసి మూడు మూడు మొక్కల చొప్పున ఆగస్ట్ 15 న నాటాల్సిందిగా సవాల్ విసురుతున్నట్టు ఆయన తెలిపారు.

- Advertisement -