కొత్త రెవెన్యూచట్టంతో అవినీతికి చెక్‌:సీఎం కేసీఆర్

187
cm kcr assembly
- Advertisement -

కొత్త రెవెన్యూ చట్టంతో అవినీతికి చెక్ పడుతుందన్నారు సీఎం కేసీఆర్. శాసనమండలిలో కొత్త రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్….కొత్త రెవెన్యూ చట్టంపై కొంతమంది అవాకులు చవాకులు పేలుతున్నారని తెలిపారు. ఈ బిల్లు వల్ల భూస్వాములకు లాభం జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు కానీ ప్రస్తుతంలో రాష్ర్టంలో భూస్వాములు, జాగీర్దార్లు, జ‌మీందార్లు లేర‌ని ఇది కఠోర స‌త్య‌మ‌ని తెలిపారు.

గ‌త ప్ర‌భుత్వాలు వీఆర్వోల‌కు అన‌వ‌స‌ర అధికారాలు ఇవ్వ‌డంతో అరాచ‌కాల‌కు పాల్ప‌డ్డార‌ని సీఎం గుర్తు చేశారు. ఈ క్ర‌మంలో వీఆర్వోల‌ను ర‌ద్దు చేసి క‌ఠిన నిర్ణ‌యాల‌ను తీసుకున్నామ‌ని తెలిపారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ద్వారా ఇక‌పై త‌హ‌సీల్దార్లు కూడా అవినీతికి పాల్ప‌డే అవ‌కాశ‌మే లేద‌న్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో మార్పుల‌కు త‌హ‌సీల్దార్‌,స‌బ్ రిజిస్ర్టార్ల‌కు ఎలాంటి విచ‌క్ష‌ణా అధికారం లేద‌న్నారు. ప‌ది నిమిషాల్లోనే రిజిస్ర్టేష‌న్లు పూర్త‌య్యేలా ఏర్పాట్లు చేస్తామ‌ని కేసీఆర్ పేర్కొన్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో అప్‌డేట్ కాగానే సంబంధిత కాపీలు వ‌స్తాయ‌న్నారు.

రాష్ర్టంలో మొత్తం 60,95,134 మంది ప‌ట్టాదారులు ఉన్నార‌ని చెప్పారు. 2.5 ఎక‌రాల భూమి ఉన్న రైతులు 39,52,232 మంది ఉన్నార‌ని తెలిపారు. 2.5 నుంచి 3 ఎక‌రాల్లోపు ఉన్న రైతులు 4,70,759 మంది, 3 నుంచి 5 ఎక‌రాల్లోపు ఉన్న రైతులు 11,08,193 మంది, 5 నుంచి 7.5 ఎక‌రాల్లోపు ఉన్న రైతులు 3,49,382 మంది, 7.5 నుంచి 10 ఎక‌రాల్లోపు ఉన్న రైతులు 1,15,916 మంది, 25 వేల ఎక‌రాల్లోపు ఉన్న రైతులు 6 వేల మంది ఉన్నారని సీఎం తెలిపారు.

- Advertisement -